ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పక్కా

27-04-2024 02:23:37 AM

l ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలి

l బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు.. ఖాజానా మొత్తం ఖాళీ

l రాముడి పేరుతో ఓట్లడగడం కాదు.. 

l చేసిన అభివృద్ధి గురించి ‘బండి’ మాట్లాడాలి.. 

l రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్/సిద్దిపేట, ఏప్రిల్25(విజయ క్రాంతి): ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని, చాలెంజ్ చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రం తోపాటు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శుక్రవారం మానకొండూరు ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ గురించి మాజీ మంత్రి హరీశ్‌రావు అడుగుతున్నారని, 2023లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిందన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పు రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పును రూ.7 లక్షల కోట్లు చేసిందని నిప్పులు చెరిగారు. దీంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు అడిగిన గరీబోళ్లను గత ప్రభు త్వం నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేయించిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే, ప్రతి మండలంలోనూ తనకు మంచి మెజార్టీతో గెలిపిం చారని, ఇదే ఒరవడిలో ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షల వరకు పెంచామన్నారు. ప్రతినియోజకవర్గానికి త్వరలో 3,500 ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. 

రైతులు పండించిన ధాన్యానికి బోనస్, వృద్ధులకు నెలకు రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తామన్నారు. అయోధ్యలో రాము డి విగ్రహం ప్రతిష్ఠించకముందే అక్షింతలు ఇంటికి వచ్చాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అని ప్రచారం చేసుకుంటూ ప్రజలు ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. రాముడి ఫొటోతో రాజకీయాలెందుకు అని ఆయన ప్రశ్నించారు. రాముడి పేరు, రాము డి ఫొటో పెట్టుకుని ఓట్లు అడగడం కాదు, ఎంపీగా తాను ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. భక్తి ప్రజల గుండెల్లో ఉంటుందన్నారు. పుస్తెలు అమ్మి ఎన్నికల్లోకి దిగానంటున్న ‘బండి’కి కట్టలకు కట్టల డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం..

సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కార్మికుల కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని తెలియాజేశారు. మృతుల కుటుంబాలను  ఆడుకుంటామని హామీ ఇచ్చా రు. బీఆర్‌ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో నేతన్నలకు బిల్లులు విడుదల చేయకపోవడంతోనే చేనేత రంగం సంక్షోభంలో పడిందన్నారు. నేత కార్మికులను ఆదుకునేం దుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ అవసరాలు, సిబ్బంది కి ఉపయోపడే ఆర్డర్లను త్వరలో కార్మికులకు అప్పగిస్తామన్నారు.