20-09-2025 12:29:35 AM
సీఐ మన్మధ కుమార్
చౌటుప్పల్, సెప్టెంబర్19(విజయ క్రాంతి):చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆప్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో ట్రెజరీ లయన్స్ చిలువేరు మంగయ్య దాతృత్వంతో విద్యార్థులకు టైలు బెల్టులు చౌటుప్పల్ సిఐ మన్మధ కుమార్ చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా సీఐ మన్మధకుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న మోసాలు గురించి ఏ విధంగా అవగాహన పెంచుకోవాలి, చదువుకోవడం వలన కలిగే ఉపయోగాలు, చదువు యొక్క ఆవశ్యకత, ఉన్నత శిఖరాలకు ఏవిధంగా ఎదగాలి వంటి విషయాలు విద్యార్థులకు బోధించడం జరిగింది.
అలాగే దాత సిలివేరు మంగయని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తిరందాజ్ జగన్, ఎంఈఓ గురువారావు, మాజీ సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కోమటిరెడ్డి నరసింహారెడ్డి , ఎస్త్స్ర ఉపేందర్ రెడ్డి,మహమ్మద్ పాషా ,వెంకటేశం వేముల నరసింహ, బోలోజు రాజు చారి ,చింతల ప్రభాకర్ రెడ్డి ,సిలివేరు శివ తదితరులు పాల్గొన్నారు.