10-09-2025 12:00:00 AM
కాగజ్‌నగర్, సెప్టెంబర్ (విజయక్రాం తి): కాగజ్ నగర్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు. సకాలంలో యూరియా ఇందుక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని రైతులు వ్యవసా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
యూరియా కొరత ఉందని అధికారులు సమాధానం ఇవ్వడంతో రైతులు వాగ్వివాదానికి దిగారు. రైతులు గంటకు పైగా రహదారిపై ఆందోళన చేపట్టారు. డీల ర్లు, అధికారులు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్కు విక్రయిస్తున్నట్లు రైతుల ఆరోపించారు. రైతులకు సకాలంలో యూరి యా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేశారు.