09-09-2025 11:37:24 PM
ఎస్పీ అఖిల్ మహాజన్
ఉట్నూర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నేరాల నియంత్రణ, నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన 50 సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేసే ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంగళవారం ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఏఎ స్పీ కాజల్‌సింగ్‌లతో కలిసి ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ఉట్నూరు లో 37 సీసీటీవీ కెమెరాలు, ఇంద్రవెల్లిలో 13 సీసీటీవీ కెమెరాలతో ప్రధానమైన కూడళ్లను సీసీటీవీ నిఘానేత్రంలో ఉండి, నిష్ణాతులైన సిబ్బందిచే 24 గంటలు పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్, నార్నూర్ సీఐ ప్రభాకర్, ఎస్సైలు ప్రవీణ్, అఖిల్, మనోహర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.