calender_icon.png 12 January, 2026 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరా నది ఇక క్లీన్!

12-01-2026 12:52:21 AM

బ్యాక్ వాటర్ రైతులకు ఊరట 

ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా నష్టపోయిన రైతులు 

గత పాలకులకు ఎన్నో మార్లు రైతులు విన్నవించిన ఫలితం శూన్యం 

ఎమ్మెల్యే కృషి ఫలితం రూ. 2.8 కోట్లు మంజూరు

నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రవాహ మార్గంలో అడ్డంకుల తొలగింపు 

తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ

ఎల్లారెడ్డి, జనవరి 11: (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా మంజీరా నది పరివాహక ప్రాంతంలో రైతులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నప్పటికీ గత పాలకుల పాలనల్లో పలుమార్లు రైతులు వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేకపోయింది. మొన్న కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు దిగువన మెదక్ జిల్లా నుండి హవేలీఘన్పూర్ నుండి వస్తున్న పసుపు యేరూ, మంజీరా నదిలో కలిసి భారీ ఉధృతంగా ప్రవహించడంతో మాంజీర నది పరివాహక ప్రాంతంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం, మాల్ తుమ్మెద గ్రామం నుండి మొదలుకొని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం రుద్రారం అల్మాజిపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల వరకు నిజాంసాగర్ ఆయకట్టు ప్రాజెక్టు నీరు అధికంగా నిల్వ ఉండి రైతులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి.

నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న మాంజీర నదిలో అతి భారీగా పేరుకుపోయిన తుమ్మకంపను తొలగించడానికి గత పాలకులకు ఎన్నోసార్లు రైతులు మొరపెట్టుకున్న చేద్దాం చూద్దామని తోసి పుచ్చడంతో చెట్లు భారీగా పేరకపోయి నది పరివాహక ప్రాంతంలో ఉన్న, వేలాది ఎకరాల్లో ఉన్న పంట పంట్టా పొలాల్లో భారీగా ఎగువ నుంచి వస్తున్న సింగూర్ పసుపు పేరు మంజీరా నది లో రావడంతో ఇరువైపుల నది పొంగి పంట పొలాలు నష్టం వాటిల్లుతుంది. 

వేల ఎకరాల్లో పంట నష్టం

నాగిరెడ్డిపేట మండలం పోచారం మాల్ తుమ్మెద గ్రామం నుండి ఎల్లారెడ్డి మండలం రుద్రారం వరకు మాంజీర నది పరివాహక ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల్లో ఉన్న పట్టా పంట పొలాలు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక చొరవతో రైతులకు మంజీర నది పరివాహక ప్రాంతంలో ఉన్న నదిలో పేరకపోయినా తుమ్మకంపను తొలగించడానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులను, కోరారు.

శాశ్వత పరిష్కారం దిశగా శాసనసభ సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ఈ అంశాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్  శాసనసభ సమావేశాల్లో పలు మార్లు ప్రస్తావించడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని స్వయంగా కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్యంగా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మండల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  సానుకూల స్పందనతో ప్రభుత్వం ఈ కీలక జీఓను జారీ చేసినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ రైతులకు తీపి కబురు అందించారు.

మొన్న కురిసిన వర్షాలకు భారీ నష్టం

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్  వ్యక్తిగతంగా ముంపు ప్రాంతాలను సందర్శించి రైతులతో మాట్లాడిt పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ సందర్భంగా రైతులు నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్షోర్ ప్రాంతంలోని అడవులు, తుమ్మ పొదలు, పేరుకుపోయిన మట్టి కుప్పలు, తొలగిస్తే భవిష్యత్తులో ముంపు నష్టాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని కోరగా, ఎమ్మెల్యే మదన్ మోహన్, ఇచ్చిన హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

పెండింగ్ లో ఉన్న పేరుకుపోయిన చెట్లకు పాదాలకు మోక్షం లభించినట్లేనా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్  మాట్లాడుతూ, నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ పరిధిలోని రైతుల నుండి ఇది ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న డిమాండ్ అని, ప్రతి వర్షాకాలంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయితే భవిష్యత్తులో పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

నది పరివాహక ప్రాంతంలో రైతులకు ఇక కష్టం తీరినట్లే

రైతుల కష్టాలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించినందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఎమ్మెల్యే మదన్ మోహన్  కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ పనుల సాధనలో కీలకంగా సహకరించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కృషిని కూడా ప్రశంసించారు.

పరివాహక ప్రాంతంలో నదిలో చెట్లు తొలగిస్తే రైతులకు ఎంతో మేలు జరిగినట్లే. శాసనసభలో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న మంజీరా నది మార్గంలో పేరుకుపోయిన చెట్లను తొలగించడానికి శాసనసభలో భారీ నీటిపారుదల శాఖ మంత్రితో నియోజకవర్గ ప్రజల మంచి కోరే విధంగా, కృషి చేస్తున్నందుకు, ఈ నిర్ణయంపై ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయాణింప చేస్తున్న,ఎమ్మెల్యే మదన్ మోహన్ పట్ల చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఎల్లారెడ్డి నాగిరెడ్డి పేట మండలంలో లోని సుమారు, 22 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.