calender_icon.png 4 May, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి ప్రాంత రైతులకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తా

03-05-2025 05:32:22 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ప్రాంత చిరకాల రైతుల సమస్య సాగునీటి సమస్యను పరిష్కరించు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రాణహిత చేవెళ్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. నా జీవితకాలపు చిరకాల కోరిక ప్రాణహిత చేవెళ్ల (కాళేశ్వరం) నా చివరి శ్వాస వరకు పోరాటం చేసైన దాన్ని పూర్తి చేస్తా అని అన్నారు.

కామారెడ్డి రైతులకు శాశ్వత సాగు నీటి పరిష్కారం చూపిస్తాను అని పేర్కొన్నారు. కామారెడ్డి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాతే నేను కన్నుమూస్త అని తెలిపారు. 23 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంటనే నిధులు మంజూరు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కు కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫునప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చి దాన్ని పూర్తిగానే రద్దు చేయాలని కుట్ర పన్నింది దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ గా మార్చింది. దీని ద్వారా పేద రైతుల 3.5 tmc నీటి పరిధి తో వందల ఎకరాల భూములు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. 

10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 కోట్లు కూడా మంజూరు చేయలేదు అని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళుతున్నము దీని ద్వారా 2.8 tmc సాగునీరు అందుతుందన్నారు.పాత డిజైన్ ప్రకారం రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రాణహిత చేవెళ్ల, (కాళేశ్వరం) పనులు భూ సేకరణ, ఇతరత్రా ఇబ్బందులను త్వరగా సమీక్షించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 80% వరకు నష్టపరిహారం అందించడం జరిగింది మొత్తం కేటాయించిన 23 కోట్ల 15 లక్షల తో 100% నష్టపరిహారం అందించి పదిహేను రోజుల్లోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

దీంతో కామారెడ్డి నియోజకవర్గానికి 80 వేల ఎకరాలు, బాన్సువాడకు పదివేల ఎకరాలు, ఎల్లారెడ్డి కి 30 వేల ఎకరాలు, మెదక్ జిల్లా రామాయంపేటకు 12 ఎకరాలు సాగునీటిని అందిస్తాం అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసి చూపిస్తాను అని అన్నారు. గోదావరి జలాలు పూర్తిస్థాయిలో పైప్ లైన్లు మరమ్మతు చేసి కొత్త పైప్లైన్ వేసి 20 సంవత్సరాల వరకు తాగునీటి కొరత రాకుండా చూస్తా అని అన్నారు.వేసవికాలం వస్తున్నందున నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అన్నారు. విధుల్లో అలసత్వం వహించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా అసౌకర్యం కల్పిస్తే వారిపై చర్యలు ఉంటాయి అన్నారు. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ.. అమృత్ కాల్ పథకంలో 93 కోట్ల రూపాయలతో తాగునీటి పనులు సమీక్ష జరపగా (గోదావరి జలాలు) 104 కిలోమీటర్ల నుండి రెండో పైపులైన్ పనులు ఇప్పటివరకు 24 కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి.

మరో రెండు నెలల్లో రెండో లైను పూర్తవుతుంది అన్నారు. ఫారెస్ట్ పర్మిషన్లు ఇబ్బంది ఉంటే వెంటనే పై అధికారులతో మాట్లాడి పర్మిషన్లు వారంలో వచ్చేలా చూస్తామన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా 7200 ఉచిత నల్ల కనెక్షన్లు కొత్తవి ఇస్తున్నామన్నారు. ఈ వారంలో మొదలవుతాయని చెప్పారు. స్లమ్ ఏరియాలలో ఎక్కువ కనెక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గ్రామాలతో కలిపి 11 mld నీరు అవసరం ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 6 mld బుర్ర మత్తడి నుండి 1mld పెద్ద చెరువు నుండి 2.5mld నీరు వస్తున్నాయి రెండవ లైన్ పూర్తి అవుతాయి, ఎలాంటి నీటి సమస్యలు ఉండవు అన్నారు. 

మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ.. వేసవి కాలం పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూ ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి ఆర్ అండ్ బి ఈ ఈరవిశంకర్ మిషన్ భగీరథ ఈఈ రమేష్ కుమార్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,ఆర్డిఓ వీణ, సంబంధిత వివిధ శాఖల అధికారులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు నిమ్మమోహన్ రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి, పండ్ల రాజు, గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్, గోనె శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు కోయల్ కర్ కన్నయ్య, తేజాపు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.