03-05-2025 05:20:23 PM
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి..
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి(Palakurthi MLA Yashaswini Reddy), తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, జై బాపు, జై భీమ్, జై సంవిధన్ కార్యక్రమం పాలకుర్తి ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని హరిపిరాల గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. అహింస, శాంతి సిద్ధాంతాలను కాపాడుకునేందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘జై బాపు, జై భీమ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, చిత్తలూరి శ్రీనివాస్,అశోక్ రెడ్డి, చెవిటి సధాకర్, బూర్గుల ప్రశాంతి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు తోట అశోక్, యూత్ అధ్యక్షుడు గద్దల మధు, మహిళా అధ్యక్షురాలు చెవిటి లింగమ్మ, స్థానిక నాయకులు వల్లపు మల్లయ్య, వల్లపు నారాయణ, రావుల కిషన్ రెడ్డి, రణధీర్ రెడ్డి, పరశురాములు, రాఘవులు, గద్దల సుజాత తదితరులు పాల్గొన్నారు.