23-08-2025 05:04:48 PM
చేగుంట,(విజయక్రాంతి): ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి సాధించాలని, ప్రజారోగ్య పరిరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నార్సింగి మండల కేంద్రంలో విస్తృతంగా పర్యట పర్యటించిన కలెక్టర్ ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఆస్పత్రిలో ఉన్న మందుల గదికి వెళ్లి నిల్వ ఉన్న వివిధ రకాల మందులను ఆయన పరిశీలించారు.
మందుల నిల్వల రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టిక, ఓపి రిజిస్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణపై.వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు మందుల జాబితాను చూశారు. పక్కనే ఉన్న టీకాల గదిలోకి వెళ్ళి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పలు వ్యాక్సిన్లను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోని క్యాబోరేటరీ, ఇంజెక్షన్/ డ్రెస్సింగ్ రూమ్, ప్రసూతి గది, ఇన్ పేషెంట్ గదులను పరిశీలించారు. ఆస్పత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతాయని, గత నెలలో ఎన్ని జరిగాయని అడిగి తెలుసుకున్నారు.
రోగులతో మాట్లాడుతూ వైద్య చికిత్సలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో వారి నుంచి అతి భారీ వర్షాలు పడటం జరిగినదని మూడు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినవని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధులు, విష జ్వరాలు సోకే అవకాశం ఉన్నందున అలాగే గ్రామ ప్రజలు ఇంటిని, ఇంటి ఆవరణ ను శుభ్రంగా ఉంచుకోవాలని, పంచాయతీ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు గ్రామాలలో ప్రతి ఇంటిని సందర్శించి నీరు నిలువకుండ తొలగిస్తున్నారని దోమల లార్వాలను సమూలంగా నిర్మూలించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని దోమలు, ఈగలు వాలకుండా పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనీ ప్రజలకు హితవు పలికారు.
అనంతరం నర్సంపల్లి గ్రామంలో గ్రామ పారిశుద్ధ పనులను, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులను, పల్లె దవకానను కలెక్టర్ పరిశీలించారుతమకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరిత గతిన నిర్మించుకోవాలని, ప్రభుత్వం దశలవారీగా బిల్లులు జమ చేయడం జరుగుతుందని పేదవారి సొంతింటి కల నెరవేర్చుకోవాలని చెప్పారు. నర్సంపల్లి గ్రామ పరిసరాలను పరిశీలిస్తూ మీరు నిల్వ ఉన్న ప్రదేశాలను వెంటనే తొలగించాలని దోమలు పుట్టకుండా కుట్టకుండా చూడాలని దోమల లార్వాలను నిషేధించి ఫ్రైడే డ్రై డే సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పల్లె దావకానను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సమయపాలన పాటించాలని రోగులతో మర్యాదగా మెలగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు