calender_icon.png 13 May, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..

13-05-2025 05:03:43 PM

ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో విద్యుత్ సబ్ స్టేషన్ కు శంఖుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి...

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామంలో 33/11 కెవి విద్యుత్ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు(Minister Bhatti Vikramarka Mallu) మంగళవారం శంఖుస్థాపన చేశారు. రూ. 2.46 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దీనిలో 1x5 ఎంవీఏ గో ముత్యాలంపాడు టౌన్, ముత్యాలంపాడు ఏజిఎల్, శాంతినగర్, లక్షిపురం 11 కెవి ఫీడర్లు ఉండనున్నాయి. దీనితో ముత్యాలంపాడు, పాతతాండా, కొత్తతండా, రాంపురం, తావుర్యతండా, ఈర్యతండా, తడికలపూడి, కోక్యాతండా, పాతతడికలపూడి, లక్ష్మీపురం గ్రామాలు లబ్దిపొందనున్నాయి.

దీనితో విద్యుత్ లోడ్ నియంత్రణ చేయవచ్చని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి బేతంపూడి దర్గా నుంచి మద్దిరాలతండా వరకు నిర్మించనున్న తారు రోడ్ పనులకు శంఖుస్థాపన చేయాల్సి ఉండగా వాయిదా పడింది. సింగరేణి(Singareni) కోయగూడెం ఉపరితల గనిని సందర్శించాల్సి ఉండగా అదికూడా విరమించారు. శంఖుస్తాపనను ఐదు నిమిషాల్లో పూర్తి చేసి భోజన విరామానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) గృహానికి వెళ్లారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్ పి రోహిత్ రాజ్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్, విద్యుత్ శాఖా అధికారులతో పాటు వివిధశాఖల చెందిన అధికారులు పాల్గొన్నారు.