04-07-2025 12:48:47 AM
ఆడమగ తేడాలేకుండా అర్థరాత్రి వరకు జల్సాలు
విదేశీ మద్యం, డ్రగ్స్, గంజాయి వాడకాలు
పాడు కల్చర్తో యువతరం భవిష్యత్తు అంధకారం
అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా రిసార్టుల నిర్వహణ
దొరికితే తప్పా వెలుగులోకి రాని నిజాలెన్నో
నిఘా వ్యవస్థ దృష్టి సారించాలంటున్న స్థానికులు
ఇబ్రహీంపట్నం, జూలై 3: ఆర్థిక శ్రీమంతులు తీసుకొచ్చిన రిసారట్స్ కల్చర్ ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. సంతోషం, సంబరం , పెళ్లిరోజు, ఆఫీసు సక్సెస్ మీట్ లు ఇలా సం తోషంగా జరుపుకునే ఏ దావతులకైనా మనకందరికీ టక్కున గుర్తొచ్చేవి రిసారట్స్ లు. ఒకప్పుడు రిసారట్స్ అంటే దూర ప్రాం తాలు గుర్తొచ్చేవి.
ఇప్పుడు మన ప్రాంతాల్లోనే మన చుట్టే వ్యవసాయ పొలాలను లీజుకు తీసుకుంటూ కొందరు వ్యాపారానికి తెరలేపుతున్నారు. ప్రభుత్వ ఎలాంటి నియ మ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం రిసారట్స్, ఫా మ్హౌస్లలో రేవ్ పార్టీలు, పేకాట, వ్యభిచారం వంటి కార్యకలాపాలు కామన్ గా మారిపోయాయి. రిసారట్స్ లో జరుగుతున్న అసాం ఘిక కార్యక్రమాలపై ఏమైనా ఫిర్యాదులు వ స్తేనే తప్ప అక్కడ జరుగుతున్న తతంగమం తా భావ్య ప్రపంచానికి తెలిసి వస్తోంది.
లేకపోతే అంతా గప్చుప్. ‘ ప్రస్తుతం ఈ పామూ రు కల్చర్ యువతను పెడదారి పట్టిస్తుంది. సిటీ శివారు ప్రాంతాలో రిసారట్స్ ఫామ్ హౌస్ కల్చర్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతుంది. వారంతపు సెలవు రోజులు వచ్చా యి అంటే అర్థ రాత్రులు పల్లె ల వైపు రయ్ రయ్ మంటూ ఖరీదైన కార్లు, బైకులు పరుగులు తీస్తాయి.
అర్ధరాత్రలు ఫా మ్హౌస్ రిసారట్స్ లో జరుగుతున్న పార్టీలలో డిజె సౌండ్ లతో పల్లెవాసులకు జాగారమే సరిపోతుందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్టు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచా రం మండలాల పరిధిలో పుట్టగొడుగుల్లా రిసారట్స్ లు కోకొల్లలుగా వెలుస్తూన్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని చాలావరకు రిసార్ట్లో వెలిశాయి.
వీకెండ్ వచ్చిందంటే చాలు శివారు ప్రాంతాలు గు ర్తుకు వస్తున్నాయి. వీకెండ్ లో జల్సాలు చేయడానికి శివారులలో ఉన్న పలు రిసారట్స్ వంటి కేంద్రాలను అద్దెకు తీసుకుని ఆడ,మగ అనే తేడా లేకుండా అర్దరాత్రుల వరకు జల్సాలు చేస్తున్నారు.
చాలా రిసార్ట్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసా గుతున్నాయని, దొరికితే తప్ప వెలుగులోకి రాని నిజాలెన్నో బయటకి వస్తున్నాయి. ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమ కార్యకలాపాలు జరుగుతు న్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధనార్జనే లక్ష్యంగా..
ప్రస్తుతం రిసార్టుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా మారింది. రిసార్టుల పేరుతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇందులో విదేశీ మద్యం, డ్రగ్స్, గంజాయి గుట్టుచప్పుడు కాకుండా వాడకం పెరుగుతోంది. పర్యవేక్షణ, నిఘా లోపం కారణంగా చాలా రిసారట్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నా, అధికారులు మాత్రం కాసులకు అలవాటు పడి, పట్టించు కోవడం లేదనే విమర్శలు స్థానికంగా గుప్పుమంటున్నాయి.
ధ నార్జనే లక్ష్యంగా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నడుపుతున్న రిసార్ట్ లపై పోలీ సులు నిఘా పెం చాలని, అదేవిధంగా నిబంధనలను మరచి అసాంఘిక కార్యకలాపా లకు వ్యవహరించే రిసార్ట్ లపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
రిసార్ట్ కల్చర్.. యువతపై చెడు ప్రభావం ఎంతవరకు..
గతంలో పెద్దఅంబర్పేట మున్సిపాలిటి పరిధిలోని ఓ రిసారట్స్ లో బర్త్ డే వేడుకలో గంజాయి సేవిస్తూ నలుగురు అమ్మా యిలు, మరో 30 మంది ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పోలీసుల రైడింగ్లో పట్టుబడ్డారు. అయితే నియోజకవర్గంలో ఇటువంటి కొన్ని అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే అక్రమ రిసార్ట్ నిర్మాణాలకు తెర తీస్తున్నారు.
ఇలాం టి వాటిపై రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటికీ ఇటు గ్రామ పంచాయతీ నుంచి గానీ హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుం డా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారుల పర్యవేక్షణ మాత్రం శూన్యం.
ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తప్పవు...
-నియోజకవర్గ పరిధిలోని రిసార్ట్ లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తమ దృష్టికి వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మద్యానికి, గంజాయి, డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.
కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనల్లో పట్టుబడుతున్న యువతకు కౌన్సిలింగ్ సైతం ఇస్తున్నాము. అప్పటికి మార్పు రాకుంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. కావున తల్లిదండ్రులను గౌరవిస్తూ, విద్యతో పాటు క్రీడల్లో ఆసక్తి చూపుతూ యువత తమ లక్ష్యాలను చేరాలని సూచించారు.
ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజు
తల్లిదండ్రులకు తప్పని కన్నీటి శోకం..
ప్రస్తుతం సమాజంలో విద్యార్థుల పాత్రపై తల్లిదండ్రులకు భయాం దోళన మరింత పెరుగుతోంది. పాడు కల్చర్‌తో యువత రిసార్ట్‌ల్లో బర్త్ డే, ఇతర దావత్ ల పేరుతో డ్రగ్స్, గం జాయి, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతూ భవిష్యత్తును అంధాకారం చేసుకుంటున్నారు.
తమ పిల్లలపై అతిగారాబం విచ్చలవిడితనం వంటి నమ్మ కంతో తల్లిదండ్రులు స్వేచ్చనిస్తే, చెడు వ్యసనాలకు బానిసై, కొందరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుండగా, మరికొందరు తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తున్న సందర్భాలెన్నో. చివరకు తల్లిదండ్రులకు మాత్రం కన్నీటి శోకం మిగిలిస్తున్నారు. తమ పిల్లలపై పెట్టుకున్న కోటి ఆశలన్నీ నీటిపై బుడగలా మారుతున్నాయి.
బొడ్డు రవి, ఉపాధ్యాయుడు