10-07-2025 12:26:33 AM
బెజ్జూర్ జూలై 9 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం బుధవారం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రాథమిక సహకార సంఘం లో యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నప్పటికీ బయోమెట్రిక్ సమస్య తలెత్తడం తో రైతులు గంటలు తరబడి క్యూలైన్ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఇంచార్జ్ సీఈవో సత్యనారాయ ణ గౌడ్ రైతుల ఆధార్ పట్టా పాస్ పుస్తకం, జిరాక్స్ తీసుకొని రసీదులు అందజేసి యూరియా పంపిని సమయంలో బయోమెట్రిక్ ద్వారా యూరియా అందిస్తున్నట్లు తెలిపారు.
అరులైన ప్రతి రైతుకు యూరియా అందించేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్, ఏఈవోలు మీనా, మారుతి, శ్రీధర్ సహకార సంఘం సిబ్బంది పర్ష సంజీవ్, దేవాజీ, తదితరులు ఉన్నారు.