10-07-2025 12:26:19 AM
ఖమ్మం, జూలై 9 ( విజయ క్రాంతి ):ఖమ్మం సర్కిల్ కు క్రొత్తగా 18 సబ్ స్టేషన్ లు మంజూరు అయ్యాయని, వీటిని నూతన టెక్నాలజీ తో నిర్మిస్తున్నట్టు ట్రాన్స్కో ఖమ్మం ఎస్ ఇ ఇనుగుర్తి శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిమాండ్ కు అ నుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నామని, భవిష్యత్తు లో ఎటువంటి లోవోల్టేజ్ సమస్య ఉండద ని. సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ మరిం త మెరుగుపడుతుందని వివరించారు . మౌ లిక వసతుల అభివృద్ధికి అనుగుణంగా కొత్తసబ్ స్టేషన్‌ల రాకతో రైతులకు, వినియో గ దారులకు అంతరాయాలు తగ్గుతాయని స్ప ష్టం చేశారు . పొడవాటి ఫీడర్లు ఉండవని , ఫీడర్ నష్టాలు తగ్గుతాయని తెలిపారు . ఉ న్న సబ్ స్టేషన్ల పై లోడ్ భారం తగ్గుతుందని, తద్వారా మెరుగైన, నిరంతరాయ సరఫరా అందించగలుగుతామని చెప్పారు .