03-09-2025 11:07:36 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సదాశివపేట ఏఓ రమేష్ తో ఫోన్ లో మాట్లాడి యూరియా కొరత పై ఆరా తీశారు. స్టాక్ ఎంత ఉందని అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించారు. యూరియా స్టాక్ అందుబాటులో ఉంచాలని రైతులను యూరియా కోసం ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. యూరియా కోసం రైతులను క్యూ లైన్ లో చెప్పులు ఉంచకుండా యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఉన్నారు.