calender_icon.png 9 September, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

03-09-2025 11:12:50 PM

దౌల్తాబాద్: గ్రామాలలో ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకీ దేవి అన్నారు. బుదవారం రాయపోల్ మండలo కొత్తపల్లి గ్రామoలో 14 ఏండ్ల బాలునికి డేoగ్యు లక్షణాలు ఉన్నాయని తెలుసుకొని గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పంచాయతీ నిర్వహణతో పాటు పరిశుభ్రత పారిశుద్ధ్యం ప్రత్యక్షంగా పరిశీలించి సమస్యలను ఆరాతీశారు. 

అనంతరం వారు మాట్లాడుతూ... ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని చుట్టుపక్కల చెత్త పేరుకుపోకుండా శుభ్రత పాటించాలని అన్నారు. మస్కిటో కాయిల్, నెట్‌లు వాడడం అలవాటు చేసుకోవాలన్నారు.

ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే వ్యాధులు రాకుండా నివారించవచ్చని, పంచాయతీ స్థాయిలో ప్రతి వారంలో ఒకసారి శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.గ్రామంలోని తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారి పరిస్థితులను కూడా పరిశీలించారు. ప్రజల సహకారంతోనే ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సోమిరెడ్డి, ఎంపీవో పరమేశ్వర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.