13-09-2025 02:22:29 AM
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 12: యూరియా సరఫరాలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దనీ రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిని ఉషా అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పిఎసిఎస్ మంగళపల్లి పటేల్ గూడా వద్ద జరుగుతున్న యూరియా విక్రయ కేంద్రాన్ని శుక్రవారం డీఏఓ ఉషా, ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజు తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా యూరియా కేంద్రంలో నిల్వ ఉన్న యూరియాను పరిశీలించారు.
అనంతరం పీవోఎస్ ద్వారా జరుగుతున్న విక్రయాలను పరిశీలించిన అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాకు అవసరమైన యూరియా నిరంతరం సరఫరా అవుతుందని, అధిక మొత్తంలో యూరియా బస్తాలు కొని నిల్వ చేయవలసిన అవసరం లేదని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో గత వానకాలంలో 860 టన్నుల యూరియా సరఫరా కావల్సిఉండగా, ఇప్పటికే 850 టన్నులు సరఫరా అయిందని, మరో వారం రోజుల్లో 60 టన్నులు సరఫరా అవుతుందని ఆమె తెలిపారు.
అనంతరం ఎంపీ పటేల్ కూడా గ్రామానికి చెందిన మెట్టు అశోక్ రెడ్డి పండిస్తున్న వరి కెఎన్‌ఎం 1638 పి జె టి ఎస్ ఏ యు విత్తనచెనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ పద్మజ, ఇబ్రహీంపట్నం ఏ డి ఏ సుజాత, ఏవో హరినాథ్, మండల వ్యవసాయ అధికారిని విద్యాధరి, ఏఈఓ శ్రవణ్, సహకార సంఘం సెక్రటరీ మాధవి, చైర్మన్ ఎం మహేందర్రెడ్డి, ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి లతో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.