13-09-2025 02:23:51 AM
అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 12: రంగారెడ్డి జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి వాగులు, కుంటలు పొంగి పొల్రుతున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామ పరిధిలోని ఇందిరాసాగర్, నిండుకుండలా మారి అలుగు పోస్తోంది. మజీద్ పూర్, గుంతపల్లి గ్రామాల మధ్య అవంతి కాలేజీ వంతెన వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.
దీంతో ఈ రహదారి నుంచి రాకపోకలు సాగించే ప్రజలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో రావి నారాయణరెడ్డి కాలనీ ఫేస్_3 భూదాన్ ల్యాండ్ లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు వరద నీటితో పూర్తిగా నిలమయంతో నిండి ఉన్నాయి.