09-10-2025 12:09:14 AM
బాల్కొండ, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): రైతులు తమ పంట పొలాల వద్ద విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ నర సయ్య సూచించారు. బాల్కొండ గ్రామంలో బుధవారం రైతు పొలం బాట కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్ ఇన్స్పెక్టర్ నరసయ్య రైతులకు పలు సూచనలు చేశారు.
పొలాల మధ్య ఉన్న మోటార్లు, స్టార్టర్లు, పీవీసి పైపులు ఉండేలా చూసుకోవాలని ప్రతి విద్యుత్ పరికరానికి తప్పనిసరి ఎర్తింగ్ చెయ్యాలని సూచించారు. లోఓల్టేజి సమస్య రాకుండా విద్యుత్ మోటార్లుకు కెపాసిటర్లు అమర్చుకోవాలని కోరారు.
సమస్యలు ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలపాలని కోరారు. ట్రాన్స్ ఫార్మర్ ఫీజులను రైతులు మార్చవద్దని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఫిర్యాదు చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో లైన్మెన్లు మల్లేష్, గంగాధర్, యాదగిరి, గణపతి, రమేష్, సోమయ్య , రైతులు పాల్గొన్నారు.