calender_icon.png 6 November, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంపశయ్యపై ఫీజు పథకం!

04-11-2025 12:00:00 AM

పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా ఉన్నత విద్యను అం దించాలనే సదుద్దేశంతో తెచ్చిన పథకమే ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’. 2008లో అప్ప టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం ఎంతోమంది పేద పిల్లలకు విద్యాప్రదాయినిగా మారింది. ఇంజనీరింగ్, మె డిసిన్, ఫార్మసీ లాంటి వృత్తి విద్యా కోర్సు లు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్న సమయంలో ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం’ ఆయా వర్గాల పిల్లలకు వరంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు.

ఎంతోమంది పేద విద్యార్థుల ను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దిన  ఘనత ఈ పథకానికి సొంతం. అలాంటి గొప్ప నేపథ్యం ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం.. నిధుల జాప్యం విడుదల తో ఇవాళ అంపశయ్యపై ఉన్నదా? అనే అనుమానం కలుగుతున్నది. తెలంగాణ రాష్ర్టంలో దాదాపు 90 శాతం మంది వి ద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరంతా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

గత నాలుగైదు సంవత్సరాలుగా విద్యార్థులకు అందించాల్సిన దాదాపు రూ. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు గుట్టలా పేరుకుపోయాయి. ఈ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ప్రభుత్వ అసమర్థత కారణంగా లక్షల మంది విద్యా ర్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. బ కాయిల కారణంగా విద్యను మధ్యలోనే చాలించాల్సిన దుస్థితి ఏర్పడింది. 

ఆవేదనలో విద్యార్థులు

పభుత్వం ఏ విద్యాసంవత్సరానికి సం బంధించిన నిధులు ఆ విద్యా సంవత్సరంలో విడుదల చేయకపోవడం వల్ల బకా యిలు పేరుకుపోతున్నాయి. దీని మూలం గా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజు వసూళ్ల కు పాల్పడుతున్నాయి. ఫీజు క్లియర్ చేయకపోతే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి.

దీని మూలంగా డిగ్రీ, పీజీ లు పూర్తి చేసిననప్పటికీ సర్టిఫికెట్లు లేక  విద్యార్థులు పై చదువులకు అడ్మిషన్లు పొందలేక, ఉద్యోగాలు పొందలేక ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ కోసం చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుంటూ జీవ నం కొనసాగిస్తూ ప్రభుత్వ అసమర్థత కు బలవుతున్నారు.  పేద విద్యార్థులను ఉ న్న త విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం తో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఫీజు రీయింబర్స్‌మెం ట్ పథకాన్ని తీసుకొచ్చిందని, అలాం టి ప థకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని ఎన్నికల ప్రచారంలో నేటి సీఎం రే   వంత్‌రెడ్డి ఆరోపించారు.

మా ప్రభుత్వం ఏ ర్పడితే బకాయిల్ని విడుదల చేసి ఇంకా గొ ప్పగా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తీరా కాంగ్రెస్ ప్రభు త్వం వారు చెప్పుకుంటున్న ప్రజా ప్రభు త్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరా లు గడుస్తున్నప్పటికీ ఫీజు బకాయిలు వి డుదల చేయకపోవడంతో అవి కుప్పలా పెరిగిపోతూనే ఉన్నాయి. గ్రీన్ ఛానల్ ఏ ర్పాటు చేసి నెలనెలా రీయింబర్స్‌మెంట్ పథకానికి నిధులు విడుదల చేస్తామని ప్ర భుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం చేసిన వా గ్దానం అటకెక్కింది. 

హామీలు గాలికి

దసరా పండుగకు ముందు రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క  ప్రైవేట్ కళాశాలల యజమాన్య బృందంతో మాట్లాడారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయ డానికి ప్రభుత్వం దగ్గర రూపాయి లేదని, సంక్షేమ పథకాలకే నిధులు కరువయ్యాయని వ్యాఖ్యానించినట్లు సామాజిక మా ధ్యమాల్లో వార్తలు వినిపించాయి.  బకాయిలు చెల్లించేందుకు అధికార ప్రభుత్వమే రూపాయి లేదనడం చూస్తుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను ప్రభుత్వం ఎత్తివేయాలనే యోచన లో ఉన్నట్లుగా అనిపిస్తున్నది.

ఈ నేపథ్యం లో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయి లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫీజులు చెల్లించక పోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తమ జీవితాలు గం దరగోళంలో పడ్డాయని విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా త్రం ఎలాంటి చలనం రావడం లేదు. ప్ర జాస్వామ్యయుతంగా నిరసన తెలియజేసే హక్కు ను కూడా హరిస్తూ.. విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కే సులు బనాయిస్తూ, విద్యార్థి ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది.

గందరగోళం

మరోవైపు ఫీజుల బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యాసంస్థలను నడపలేకపోతున్నామని, సిబ్బందికి జీతా లు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు కూడా ఫీ జులు  చెల్లించలేని స్థితిలో ఉండడంతో వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ) కాలేజీల ను నిరవధికంగా బంద్ చేస్తామని దసరా పండుగ ముందు హెచ్చరించాయి.

నిరవధిక బంద్‌పై వెంటనే స్పందించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  విడతల వారీగా వారం రోజుల్లో 600 కో ట్లు విడుదల చేసి, దీపావళి నాటికి మరో 600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఎఫ్‌ఏటీహెచ్‌ఏ బంద్‌ను విరమించుకుంది. కానీ దసరా ముగిసి దీపా వళి అయిపోయి రెండు వారాలు కావొస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో సోమవారం నుంచి ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మళ్లీ బంద్‌కు పిలుపునిచ్చింది. 

గతంలో కూడా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎన్నడూ లేని విధంగా విద్యాసంస్థలను నిరవధికంగా వారం రోజులు మూసివేసినప్పటికీ,సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తా మని చెప్పినప్పటికీ ప్రభుత్వం వారికి ఏదో ఒక హామీనిస్తూ కాలం గడుపుకుంటూ వస్తోంది. పైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల్లో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల కారణంగా సమాఖ్య ఒక్క మాట మీద నిలబడలేకపోతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల  వ్యవహార శైలి కారణంగా విద్యార్థులు గందరగోళ స్థితిని ఎదుర్కొంటున్నారు. మాట మీద నిలబడి, పట్టుబట్టి మొత్తం బకాయిలను విడుదల చేయించకుంటే విద్యార్థి సమాజంలో ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం. 

ప్రశ్నిస్తే ఎంక్వైరీలా?

మాట తప్పిన ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరవధిక బంద్ పాటిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం.. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అవినీతిపై, నిధుల గోల్ మాల్ పై విజిలెన్స్ ఎంక్వురై ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ బకాయిల విడుదల కోసం బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంలో విచారణ చేయడం తగదని ఎఫ్‌ఏటీహెచ్‌ఐ వాపోతున్నది.

విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రభుత్వం విజి లెన్స్ పేరుతో ఎందుకు ఎంక్వైరీలు చేయ డం లేదని? నిబందనలు పాటించని కళాశాలలకు ఎందుకు అనుమతులు ఇస్తున్నా యో? ప్రభుత్వం వివరించాల్సిన అవసరముంది. ప్రైవేట్ కళాశాలలకు ఇబ్బడి ము బ్బడిగా ఫీజులు పెంచుకోవడానికి టీఏఎఫ్‌ఆర్‌సీ అనుమతులు ఎలా ఇస్తున్నదో, ఒకవేళ తప్పుడు సమాచారం అందిస్తే ఆయా కళాశాలలపై అప్పుడే ఎందుకు చ ర్యలు తీసుకోలేదో ప్రభుత్వం స్పష్టం చే యాల్సిన అవసరముంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులను మాన వ వనరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కనీసం భూముల అమ్మకం ద్వారా, మద్యం టెండర్ల ద్వారా వచ్చిన నిధులనైనా ఈ పథకం కోసం వెచ్చించాలని.. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్ల లను చదువుకు దూరం కాకుండా ప్రభు త్వం ఆదుకోవాలని తెలంగాణ సమాజం కోరుతున్నది.

  వ్యాసకర్త సెల్: 9705665810