calender_icon.png 6 November, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికుల భద్రతకు రక్షణేదీ?

04-11-2025 12:00:00 AM

వారం రోజుల వ్యవధిలోనే రెం డు బస్సు ప్రమాదాలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు.. ప్ర భుత్వాల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచా యి. కర్నూలు అగ్నిప్రమాదంలో 19 మం ది, చేవెళ్ల ఆర్టీసీ దుర్ఘటనలో 20కి పైగా మరణించడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ప్రజాకర్షక ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలు, వాటికి అనుగుణంగా మౌలిక వస తులు, రవాణా వ్యవస్థను సిద్ధం చేయకపోవడం వల్లనే ఈ దుర్ఘటనలు సంభవిం చాయి.

ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తూ, మరోవైపు పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడపకపోవడం ఆర్టీసీ సంస్థ తీవ్ర వైఫల్యంగా పేర్కొనవచ్చు. సోమవారం చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డ ప్ర మాదంలో మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం, ఆర్టీసీ బస్సులో ఓవర్‌లోడింగ్ ఉండటమే. ఉచిత ప్రయాణ పథకం ద్వారా బస్సులలో రద్దీ విపరీతంగా పెరిగినప్పటికీ, సంస్థ అదనపు సర్వీసులను నడ పడానికి బదులు, ఉన్న బస్సుల్లోనే సీటిం గ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటుంది.

ప్రజా రవాణా వ్యవ స్థ నిబంధనల ప్రకారం ఇది స్పష్టమైన ఉల్లంఘన. ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఆర్టీసీ విఫలమైంది. ఈ ఓవర్‌లో డింగ్‌కు బాధ్యులైన అధికారులపై, సిబ్బందిపై తక్షణమే నియమాలను అనుసరించి చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ బస్సు ప్రమాదానికి మరో కీలక కారణం.. జాతీయ రహదారి (ఎన్‌హెచ్) విస్తరణ పనులు ఏళ్ల తరబడి నిలిచిపోవడం.

రద్దీగా ఉండే ఈ మార్గాన్ని ఇరుకుగా ఉంచడం, మౌలిక సదుపాయాల లోపాన్ని తెలియజేస్తోంది. స్థానిక రాజకీయ వివాదాలు, పర్యావరణ అనుమతుల సాకులతో రోడ్డు పనులను పెండింగ్‌లో ఉంచడం అనేది అధికారుల విధుల పట్ల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. ఓవర్‌లోడింగ్‌తో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, ఇరుకు రోడ్డుపై అతివేగంతో వచ్చి న లారీని ఢీకొనడం.. ఈ ప్రమాదం పాల నా వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.

ప్రమాదాలు కొత్త కాదు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 19 మంది మరణించారు. అయితే  ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు కొత్తేమీ కాదు. ఇప్పటివరకు చేవేళ్ల రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదాల్లో 200 మంది మృతి చెందగా.. 600 మంది గాయాలపాలయ్యారు. అసలు ఆ రోడ్డుపై ఎందుకిలా ప్రమాదాలు జరుగుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది.

నిజానికి ఎన్ హెచ్ 163 అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన ఉంది. అయితే, ఈ రహదారికి ఇరు వైపులా చెట్లు ఎక్కువగా ఉండటంతో గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతుల జాప్యంతో నిర్మాణాలకు బ్రేక్ పడుతోంది. హైదరాబా ద్-  ఎన్‌హెచ్ 163 (చేవెళ్ల రోడ్డు)లో గత ఐదేళ్లలో మేజర్ యాక్సిడెంట్స్ చాలానే అయ్యాయి. ఇరుకైన రోడ్లు, షార్ప్ బెండ్స్, ఓవర్‌లోడ్ టిప్పర్లు, రాంగ్-సైడ్ డ్రైవింగ్ కారణంగా ప్రతి నెలా ఒకటి రెండు ఘోరాలు జరుగుతూనే వస్తున్నాయి.

సోమవారం ప్రమాదానికి రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం కారణమైతే, గతేడాది డిసెంబర్ 2వ తేదీన ఆలూరు గేట్ దగ్గర వేగంగా వస్తున్న లారీ కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా 2018 నుంచి జరి గిన వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 200 మందికి పైగా చనిపోయారు. ఆరు వందల మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. 

అసలు దోషులెవరు?

కర్నూలు బస్సు అగ్నిప్రమాదం వెనుక ప్రైవేటు రవాణా సంస్థల అక్రమ ధోరణి స్పష్టంగా ఉంది. అనుమతులు లేకుండా బస్సు రూపకల్పనను మార్చడం, అత్యంత మండే స్వభావం గల వస్తువులను తరలించడం అనేది చట్టపరంగా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, నేరపూరితమై న చర్య. ప్రయాణికులకు భద్రత కల్పించే కనీస నిబంధనలను, అగ్ని నిరోధక ప్రమాణాలను విస్మరించినందుకు ఆ సంస్థలపై ఉక్కుపాదం మోపాలి. ఈ అక్రమాలకు పాల్పడే సంస్థలపై లైసెన్స్‌ల రద్దుతో పా టు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

చేవేళ్ల ఘటనలో ఉచిత బస్సు ప్రయాణం పేరుతో పథకం తీసుకొచ్చిన ప్రభుత్వానిపై నిందను వేయలేం. ఎందుకంటే ప్రయాణికుల భద్రతను చూసుకోవాల్సింది ఆర్టీసీ సంస్థ. కొత్త బస్సులు కొనుగోలు చేశామని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఆర్టీసీ మాత్రం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనంగా బస్సు సర్వీసులు పెంచడంలో మీనమేషా లు లెక్కిస్తున్నది. అయితే చేవేళ్ల ప్రమాదంలో బస్సు డ్రైవర్ తప్పు లేదని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొనడం గమనార్హం. టిప్పర్ అతివేగంగా దూసుకురావడంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించింది.ఆర్టీసీ సంస్థ తమకు అందుబాటులో ఉన్న తక్కువ బస్సులతోనే ఎక్కువ లాభాలు పొందాలనుకోవడం క్రూరమైన చర్య కిందకు వస్తుంది. 

ప్రభుత్వాలకు హెచ్చరిక

ఈ రెండు దుర్ఘటనల విషయంలో ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. రద్దీని నియంత్రించడంలో విఫలమైన ఆర్టీసీ అధికారులపై, రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యానికి కారణమైన ఇం జినీరింగ్ అధికారులపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలి. ప్రైవేటు సంస్థల అక్రమాలను అరికట్టడంలో విఫలమైన రవా ణా శాఖ అధికారులపై కూడా జవాబుదారీతనం విధించాలి. కేవలం పరిహారాలు ప్రకటించడం కాకుండా, ప్రాణ నష్టానికి కారణమైన వారిపై కఠిన శిక్షలు విధించ డం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించగలం.

ప్రభుత్వాలు త క్షణమే స్పందించి, చేవెళ్ల వద్ద నిలిచిపోయి న జాతీయ రహదారి విస్తరణ పనుల ను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టా లి. ఆర్టీసీ సంస్థ తమ సిబ్బందికి భద్రతా నిబంధనలపై శిక్షణ ఇవ్వాలి. అలాగే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసి, అదనపు సర్వీసు ల ను న డపాలి. రోడ్డు భద్రతను అత్యంత ముఖ్యమైన పాలనా అంశంగా గుర్తించాలి. ఈ వి షాదాలు ప్రభుత్వాలకు ఒక తీవ్రమైన హె చ్చరిక. ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఏమాత్రం విఫలమైనా, పాలక వర్గాలు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 వ్యాసకర్త సెల్: 9640466464