07-05-2025 12:00:00 AM
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో ఘటన
ఘటనా స్థలంలో లభించిన 303 రైఫిల్
సుక్మాలో ఇన్‌ఫార్మర్ నెపంతో ఆదివాసీ హత్య
రాయ్‌పూర్, మే 6: తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్టు సీనియర్ పోలీస్ అధికారి మంగళవారం పేర్కొన్నారు. సోమవారం రోజు కర్రెగు ట్టల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ మీడియాకు వివరించారు. కర్రెగుట్టల ప్రాంతంలో పోలీసులు కూం బింగ్ మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు నలుగురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమ య్యాయి. గత రెండు వారాల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేపడుతున్నారు.
తాడుతో గొంతుకోసి ఆదివాసీ హత్య
సుక్మాలో మావోయిస్టులు బుచి కి రాముడు అనే ఆదివాసీ గిరిజనుడిని హతమార్చారు. తారలగూడ గ్రామ ఉప సర్పంచి రాముడు సో మవారం సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇం టి వద్ద ఉండగా, సాధారణ వస్త్రధారణలో వచ్చిన ఐదుగురు మావో యిస్టులు, రాముడిని ఇంటి నుంచి లాక్కెళ్లి, తాడుతో గొంతు కోసి హత్య చేశారు. ఇన్‌ఫార్మర్ నెపంతో అతన్ని హతమార్చినట్టు తెలుస్తోం ది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.