07-05-2025 12:00:00 AM
భారత్‌కు అండగా ఉంటామని హామీ
న్యూఢిల్లీ, మే 6: ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీ మంగళవారం ప్రధాని మోదీకి ఫో న్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించినట్టు విదేశీ వ్యవహారాల మం త్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత్‌కు అండగా నిలిచినందుకు ఖతార్ ఎమిర్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.