calender_icon.png 10 September, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించండి

05-09-2025 12:48:09 AM

కింద స్థాయి అధికారులకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు కోరిన కలెక్టర్

భద్రాచలం, సెప్టెంబర్ 4, (విజయక్రాంతి):భద్రాచల పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఎటువంటి ప్రమాదా లు జరగకుండా, విజయవంతంగా, శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు వినా యక భక్తమండలి నిర్వాహకులు అధికారులకు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో వినాయక ప్రతిమ లను నిమజ్జనం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకో వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

గురువారం భద్రాచలంలోని గోదావరి ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన నిమజ్జనం ప్రదేశాలను సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్టతో కలిసి గోదావరిలో వినాయక ప్రతిమలను ఏ విధంగా నిమజ్జనం జరుగుతున్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నది తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్ల వద్ద లాంచీలు బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు వంటి అన్ని ఏర్పాట్లు చేసి 24 గం టలు సిబ్బంది నిమజ్జనం చేసే భక్తులకు అందుబాటులో ఉండాలని, నదీ తీర ప్రాం తంలో ఎటువంటి అపశృతి జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ భక్తులకు, గణేశ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచనలు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపులో భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, పెద్ద సంఖ్యలో గుంపులు ఏర్పడి అల్లర్లు చేయకుండా శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలన్నారు. ఊరేగింపుల సమయంలో డీజేలు, అధిక శబ్దపూరిత మ్యూజిక్ వాడకూడదని, ట్రాఫి క్కు ఆటంకం కలిగించకుండా మున్సిపల్, పోలీస్ శాఖల సూచనల మేరకు మాత్రమే ఊరేగింపులు కొనసాగించాలని,నిర్దేశించిన ప్రదేశాలలోనే వినాయక నిమజ్జనం చేయాలని అన్నారు.

వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నదీ ఘాట్ ప్రాం తంలో జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాలకు రాకూడదని, విగ్రహాల నిమజ్జనం క్రమపద్ధతిలో జరగాలని ఆయన హెచ్చరించారు.

జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా వినా యక నిమజ్జన కార్యక్రమం అధికారుల సూచనల మేరకు చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఇరిగేషన్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ఏ ఈ వెంకటేశం, మత్స్యశాఖ ఇంతియాజ్, భద్రాచలం తాసిల్దార్ వెంకటేశ్వర్లు, గ్రామపం చాయతీ ఈవో శ్రీనివాస్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.