calender_icon.png 4 October, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీవర్షాల నష్టంపై సుప్రీంకోర్టు

04-10-2025 01:06:00 AM

మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి ఆరా

సుదర్శన్ రెడ్డిని కలసిన మెదక్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి

మెదక్, అక్టోబర్ 3 (విజయక్రాంతి):ఉమ్మడి మెదక్ జిల్లాలో బారీ వర్షాలకు పంటల నష్టంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి ఆరా తీశారు. మెదక్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, ఉమ్మ డి జిల్లా న్యాయవాదుల జేఏసీ మాజీ అధ్యక్షులు వి.ప్రతాప్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గు ర్తు చేసుకున్నారు.

మెదక్ డిగ్రీ కళాశాలలో గతంలో  ఏర్పాటు చేసిన వర్క్ షాప్, మెదక్ జిల్లాకు అదనపు జిల్లా జడ్జి కోర్టు మంజూరులో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి న్యాయవాదులకు నిర్వహించిన వర్క్ షాప్ కార్యక్రమ వివరాలను, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గతంలో నిర్వహించిన సెమినార్ వివరాలను  సుదర్శన్ రెడ్డి గుర్తు చేసినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక సం స్థలు ఎన్నికల నిర్వహణ, తదితరాంశాలపై చర్చించినట్లు ప్రతాపరెడ్డి తెలిపారు.

ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు  సంబంధించి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, అంతర్ వాణిజ్య పంటలకు సంబంధించి చర్చించినట్లు వివరించారు. ఏడుపాయల దుర్గామాత ఆలయం జలదిగ్బంధంపై ఆరాతీశారు. గతంలో వర్షాలు కురిసినా ఇంత నష్టం ఎప్పుడు జరగలేదని న్యాయవాది ప్రతాప్ రెడ్డి వివరించినట్లు తెలిపారు.