29-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ సహా మరో 50 మంది పో లీసుల అదుపులో ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) పేర్కొంది. వారందరినీ కోర్టు లో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం డీకేఎస్‌జడ్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22తో ఉన్న ఆ ప్రకటన గురువారం సోషల్ మీడియాలో వెలుగుచూసింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మా రేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ అప్పుడే దేవ్‌జీ సహా మరో 50 మందిని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30(ఆదివారం)న ఛతీస్‌గఢ్, దండకారణ్య బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.