calender_icon.png 26 August, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం

25-07-2024 12:05:00 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు 

సంగారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే కుట్రలు చేస్తే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో మతోన్మాదుల దాడులకు వ్యతిరేకంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మతోన్మాద దాడులను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయలన్నారు. మతపరమైన పాలన కాకుం డా సంక్షేమ పాలన అందించాలన్నారు. మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద జలలొద్దీన్, సీపీఐ నాయకులు వాజీద్ బేగ్, ఎండీ మహబూబ్ ఖాన్, అజారుద్దీన్, కాశీనాథ్, మొహియినుద్దీన్, సీపీఎం నాయకులు బీరం మల్లేశం, కే రాజయ్య, మణిక్యం, ప్రవీణ్‌కుమార్, నర్సింహులు, అశోక్ పాల్గొన్నారు.