calender_icon.png 16 October, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలోని ఎస్సీ వెల్ఫేర్ గురుకులాల్లో 81 ఖాళీ సీట్ల భర్తీ

16-10-2025 08:12:25 PM

దరఖాస్తుకు అక్టోబర్ 23 తుది గడువు

5 నుండి 9వ తరగతి వరకు ఖాళీలు: టీజీ సీఈటి అర్హులకే మొదటి ప్రాధాన్యత

కలెక్టరేట్‌లోని హెల్ప్ డెస్క్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేస్తున్నట్లు, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ప్రకటనలో తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలురు, బాలికల పాఠశాలల్లో కలిపి మొత్తం 81 సీట్లు ఖాళీగా మిగిలి ఉన్నాయని తెలిపారు. మదనాపురం, వీపనగండ్ల మండలాల్లోని బాలుర పాఠశాలల్లో, అదేవిధంగా బాలికలకు సంబంధించి కొత్తకోట, గోపాల్పేట, పెద్దమందడి మండలాల్లోని పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ మిగిలిన ఖాళీల భర్తీ కోసం టీజీ సీఈటి ప్రవేశ పరీక్షలు అర్హత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఆ తర్వాత తదుపరి ఇంకా మిగిలిన ఖాళీలు ఉంటే పరీక్ష రాయనటువంటి విద్యార్థులను డ్రా పద్ధతిలో తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 

కలెక్టరేట్ లోని హెల్ప్ డెస్క్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు..

అర్హత గల విద్యార్థులు అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు జిల్లా కలెక్టరేట్ (ఐడిఓసి) కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ నందు సంప్రదించి ఖాళీ సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, టీజీ సీఈటి సెట్ హాల్ టికెట్ జిరాక్స్ కాపీలను దరఖాస్తు వెంట జతపరిచి ఇవ్వాలని తెలియజేశారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫోన్ ద్వారా త్వరలో సమాచారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. 

మదనపురం, వీపనగండ్ల మండలాల బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఖాళీలు 

* ఐదో తరగతిలో ఎస్సీ కేటగిరి 3, ఎస్టీ 1, బీసీ 2, ఓసీ 2, మైనారిటీ 1 మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. 

* ఆరో తరగతిలో ఎస్సీ కేటగిరి 7, ఎస్టీ 1, బీసీ 1, ఓసీ 2, మైనారిటీ 1 మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. 

* ఏడో తరగతి లో ఎస్సీ కేటగిరి 1, మైనారిటీ 1 మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. 

* 8వ తరగతి లో ఎస్సీ కేటగిరి 7, ఎస్టీ 1,  మైనారిటీ 1 మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. 

* 9వ తరగతిలో ఎస్సీ కేటగిరి 9, ఎస్టీ 2, బీసీ 1, ఓసీ 2, మైనారిటీ 1 మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. 

గోపాలపేట, కొత్తకోట, పెద్దమందడి మండలాల బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఖాళీలు 

* ఐదో తరగతిలో ఎస్సీ కేటగిరి 4,  ఓసీ 1, మైనారిటీ 1 మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. 

* ఆరో తరగతిలో ఎస్సీ కేటగిరి 4, ఎస్టీ 1, ఓసీ 3,  మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. 

* ఏడో తరగతి లో ఓసీ 1, మైనారిటీ 1 మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. 

* 8వ తరగతి లో ఎస్సీ కేటగిరి 6, ఎస్టీ 1, బీసీ 4, ఓసీ 2, మైనారిటీ 1 మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. 

* 9వ తరగతిలో ఎస్సీ కేటగిరి 2, బీసీ 2,  మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి.