calender_icon.png 16 October, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల ఆత్మగౌరవ రక్షణకు బంద్ కు మద్దతు ఇవ్వండి

16-10-2025 08:08:49 PM

ఘట్ కేసర్: బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18న పిలుపునిచ్చిన బంద్ ను విజయవంతం చేయాలని ఉమ్మడి ఘట్ కేసర్ మండల బీసీ జేఏసీ కన్వీనర్ కురుపాల విజయకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ రాష్ట్ర బంద్ మన హక్కుల సాధనలో కీలక ఘట్టమన్నారు. జరగనున్న ఈ బంద్ కార్యక్రమంలో విద్యాసంస్థలు, వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని బీసీల ఐక్యతను ప్రదర్శించాలని కోరారు. బంద్ ద్వారా ప్రభుత్వం బీసీల సమస్యలకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నమన్నారు.