calender_icon.png 22 October, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు మద్దతు తెలిసిన సినీనటుడు

22-10-2025 07:53:23 PM

హైదరాబాద్: తెలంగాణలో జరుగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తన మద్దతును ప్రముఖ తెలుగు సినీనటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు తన మద్దతును ప్రకటిస్తూ నవీన్ యాదవ్ సంఘ సంస్కరనికి పెద్ద పేరు, యువకుడు, విద్యావంతుడు, సాటిమనిషికి కష్టం వస్తే వెంటనే స్పందించే మన నాయకుడు, మన గుర్తు “హస్తం”, మన అభ్యర్థి “నవీన్ యాదవ్” అంటూ ఒక వీడియోను విడుదల చేశారు. కాగా, నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 211 మంది అభ్యర్థులు ఉన్నారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.