10-07-2025 12:14:36 AM
రూ.2 లక్షల ఆర్థిక సాయం
శేరిలింగంపల్లి, జూలై 9: గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబానికి జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని అండగా నిలిచారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్న ఆయన వెంటనే చందానగర్ పి ఆర్ కె ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ కు వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన కూతురు స్రవంతికి రూ.2 లక్షల చెక్కును హీరో కృష్ణ మానినేని అందజేశారు.