10-07-2025 12:14:04 AM
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు జూలై 9 : కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం శ్రమిస్తున్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఆవరణలో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ బాలా సింగ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో ఈ నెల 11న రోడ్లు, ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.230 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వివిధ శాఖల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దా మోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు.
అనంతరం మంత్రుల సమక్షంలో 250 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసి అనంతరం మంత్రులు బహిరంగ సభలో మాట్లాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు సాగునీటి జలాలు అందించేందుకు కెఎల్‌ఐ కాల్వల మరమ్మత్తు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నయని తెలిపారు. కేఎల్‌ఐ కి సం బంధించిన రెండు మోటార్లు కూడా ఆన్ చేశామని రైతులకు ఇచ్చిన హామీల మేరకు కల్వకుర్తిని సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీని ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటి వరకు నియోజకవర్గానికి రూ. 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నా రు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో బిఆర్‌ఎస్ నేతలు ఏమి అభివృద్ధి పనులు చేపట్టారో తెలపాలని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రజాపాలనలలో ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు నియోజకవర్గంలో కే ఎల్ ఐ కోసం భూములు కో ల్పోయిన బాధిత రైతులకు రావలసిన డబ్బులు వచ్చే విధంగా చేశామని తెలిపారు.
ప్రజా ప్రతి నిధులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు సకాలంలో క్లియర్ చేశామన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గముకిచ్చిన ప్రతి హామిని నెరవేరుస్తామని ఇందులో ఎవరు సందేహ పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆనంద్ కుమార్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, నాయకులు విజయ కుమార్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మిరియాల శ్రీనివాస్ రెడ్డి, మోతిలాల్, శ్రీనివాస్ గౌడ్, రాహుల్, శ్రీకాంత్ తదితరులుపాల్గొన్నారు.