calender_icon.png 11 September, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మె నోటీసు అందజేత

11-09-2025 05:43:01 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల(Tribal Ashram School)లో పనిచేసే ఔట్సోర్సింగ్ వర్కర్స్ వార్డెన్ శ్రీనివాస్ కు గురువారం సమ్మె నోటీస్ అందజేశారు. గత ఎనిమిది నెలలుగా వేతనాలు రావడంలేదని తెలిపారు. జీతాలను ఖాతాలో జమ చేస్తామని చెప్పుతూ కాలం వెళ్ళదిస్తున్నారని దీనితో కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తే తప్ప తమ జీతాలు ఖాతాలలో జమ చేయడం లేదని వాపోయారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వర్కర్స్ రేపటి నుండి సమ్మె బాట పడుతున్నట్లు తెలిపారు.