calender_icon.png 11 September, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు జగదీశ్వర్ రెడ్డికి లేదు

11-09-2025 05:36:30 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో స్థానిక తోల్సూర్ బజార్ నుండి సూర్యాపేట జనగామ రహదారి వరకు దాదాపు రూ.30 లక్షల పైచిలుకు రోడ్డు పనులకు ఫార్మేషన్, సీసీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samel) హాజరై ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలు, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి పై మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగదీష్ రెడ్డి ని లిల్లీ ఫూట్ అనడాన్ని ఎమ్మెల్యే  సమర్ధించారు. జగదీష్ రెడ్డి ది చిల్లర బతుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరం సహచర ఉద్యమకారులం ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన పెద్ద మోసగాడు అని ఎద్దేవా చేశారు. 

జగదీష్ రెడ్డి నా పక్కన కూర్చోవడానికి వణుకుతుండే ,ప్రజలు  మీ అవినీతిని చూసి ..సీఎం రేవంత్ రెడ్డిని సీఎం కూర్చిమీద కూర్చోబెట్టారు .ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడే నైతిక హక్కు జగదీశ్ రెడ్డి కి లేదు ఉద్యమ కాలంలో నీకు ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు నీకు ఉన్న ఆస్తి ఎంత అని ప్రశ్నించారు.తెలంగాణ ప్రజలను దోచుకుని వేల ఎకరాలు దోచుకున్న దొంగ జగదీశ్ రెడ్డి అని అన్నారు. కోట్ల రూపాయలు శ్రమజీవులను దోపిడీ చేసి సొంత గ్రామమైన నాగారంలో రాజభవంతి కట్టావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది సొమ్ము అని దుయ్యబట్టారు. ప్రజలను దోచుకున్న నీవు రేవంత్ రెడ్డిని అనే నైతిక హక్కు ఎక్కడిది.రేవంత్ రెడ్డి వేగు చుక్క, ఆయన కళ్ళు తెరిస్తే మీరు మీరంతా జైలు పాలవుతారు. శంషాబాద్ లో నీకు ఫామ్ హౌస్ ఎక్కడిది, ఆవులు బర్లు ఎక్కడి నుంచి సంపాదించావు.

తెలంగాణ ప్రజల సొమ్ము కాదా అని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఓపిక పడుతున్నాడు, ఆయన సహనం కోల్పోతే మీరు ఒక్కరు రోడ్లపై తిరగరు హెచ్చరించారు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం వ్యవహరిస్తుండు, డెమోక్రసీగా వ్యవహరిస్తుండు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో నీకు ఇసుక దోపిడీ పై వచ్చిన సొమ్ముతో బంగ్లాలు బవంతులు కడుతున్నావు.తుంగతుర్తి ప్రజల సొమ్ము ఇసుకపై దోచిన సొమ్ము, కెసిఆర్ , కేటీఆర్, హరీష్ రావు,కవితకు ఎంత దోచి పెట్టారు చెప్పాలన్నారు. తుంగతుర్తి నాకు రావలసిన సీటు కోసం నువ్వు అడ్డుపడితే పీకి అవుతలపడేసి కాంగ్రెస్ గుర్తుపై గిటార్గా నిలబడి గెలిచిన దమ్ము నాది. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు 52,000 మెజార్టీతో గెలిపించిన చరిత్ర నాది. సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన నీ మెజారిటీ లిల్లీ ఫుట్ అంత ఉంది. అయినా నీవు మాత్రం ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.