calender_icon.png 11 September, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

11-09-2025 05:47:10 PM

మండల ప్రత్యేక అధికారి ఏ.సునీల్ కుమార్...

రేగొండ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ఆదేశాల మేరకు గురువారం మండలంలోని ఎంజెపి బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసినట్టు మండల ప్రత్యేక అధికారి ఏ.సునీల్ కుమార్ తెలిపారు. పాఠశాలలోని కూరగాయల స్టాక్ రిజిస్టర్, కూరగాయల తాజాదనంను పరిశీలించి, విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంటగది, భోజనశాల, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఎల్లవేళలా నాణ్యమైన విద్యను, భోజనాన్ని అందించాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని గురుకుల సిబ్బందిని హెచ్చరించారు.