calender_icon.png 29 July, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు గంగమ్మ వాగు బ్రిడ్జికి మోక్షం

28-07-2025 12:00:00 AM

  1. అప్రోచ్ పనులను పూర్తిచేసిన ఆర్ అండ్ బి అధికారులు 

కలెక్టర్ ఆదేశాలతో ఆగమేఘాల మీద పనులు పూర్తి 

కామారెడ్డి, జూలై 27 (విజయక్రాంతి) ః మూడు సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన కా మారెడ్డి జిల్లా రామారెడ్డి గంగమ్మ వాగు బ్రిడ్జి ప నులు ఎట్టకేలకు ఆదివా రం పూర్తయ్యాయి. మూ డు కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు రావడంతో ఎట్టకేలకు పనులు పూర్తిచేసి వాహన దారులకు సమస్యను పరిష్కరిం చారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ప్రత్యేక చొరవ తీసుకొని వర్షాకాలంలో వాహన దారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు.

మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించిన అర్ధాంతరంగా పనులు చేపట్టారు. కాంట్రాక్టర్కు బిల్లులు రాలేదని పనులు నిలిపివేసి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారు. వర్షాలు కురవడంతో ఆ రోడ్డుపై వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.

గత రెండు రోజులుగా ఆ రోడ్డు వెంట వెళ్లొద్దని ఆర్ అండ్ బి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎట్టకేలకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని బ్రిడ్జికి ముందు, అప్రో రోడ్డు కాకుండా బ్రిడ్జి పనులు పూర్తి చేసి వాహనదారులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌ఆర్బీ అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా ఆర్‌అండ్‌బి అధికారులు దగ్గరుండి పనులు చేయించడంతో ఆదివారం పూర్తయ్యాయి.

కలెక్టర్ పనులను పర్యవేక్షించారు. వాహనదారులు బ్రిడ్జి పైనుంచి వెళ్లేందుకు అను కూలంగా రోడ్డు పనులు పూర్తి చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కలెక్టర్ ఆశిష్ సంగువాన్‌కు రామారెడ్డి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.