calender_icon.png 29 July, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళపై దౌర్జన్యం చేసిన వారిని అరెస్టు చేయాలి

28-07-2025 12:00:00 AM

దళిత సంఘాల డిమాండ్

బాన్సువాడ, జూలై 27 ః కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ కామప్ప చౌరస్తా కూడలిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.  ఈ సందర్బంగా మాల మహానాడు సంఘం డివిజన్ అధ్యక్షులు మల్లూరి సాయిలు మాట్లాడుతూ బీర్కూర్ గ్రామానికి చెందిన నల్లజెరు జ్యోతికి  నర్ర సాయిలు న్యాయం చేయాలని, జ్యోతి వారి కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా జ్యోతిపై దాడి చేసిన నర్ర సాయిలు,

వారి అనుచరులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు, అమ్మాయికి ఆమె కొడుకుకు తగిన న్యాయం జరిగేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నసురలాబాద్ మండల అధ్యక్షులు బాల సాయిలు,

బీర్కూర్ మాల సంఘం నాయకులు కోరిమె రఘు, సంగేమ్ బాబయ్యా, అడ్ల విశాల్, పిడుగు బస్వంత్, మేడే శ్రీకాంత్ మెంటే శంకర్, నల్లజెరు బాలరాజ్, గైని శివ, పిడుగు వినోద్, మేడే ప్రవీణ్, పిడుగు సాయి,నల్లజెరు నవీన్, నల్లజెరు సాయిబాబా, ముడ లక్ష్మణ్, పాడిదేపు గోపి, నల్లజెరు శివకుమార్, నల్లజెరు బాలయ్య, నల్లజెరు జ్యోతి, సంగేమ్ శ్రీకాంత్, సంగేమ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.