calender_icon.png 30 July, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగుడికి బానిసై యువకుడి ఆత్మహత్య

29-07-2025 07:33:36 PM

కుభీర్: నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండలం రంజని గ్రామంలో జాదవ్ సచిన్(24) అనే గిరిజన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సచిన్ గత కొంతకాలంగా ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఇంట్లో వారితో గొడవ పడుతూ ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజు తల్లి ఆయనను మందలిస్తూ తాగుడు మానేయాలని సూచిస్తోంది. అయినప్పటికీ ఆయన తన వ్యసనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

తాజాగా సోమవారం కూడా తాగి ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన సచిన్ మంగళవారం తన చేనులో మద్యం సేవించి మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఇరుగుపొరుగువారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాలు సేకరించి పంచనామా అనంతరం శవాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి చిన్నాన్న చవాన్ శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.