calender_icon.png 30 July, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ తో ఉద్రిక్తత పెంచే ఆలోచన లేదు.. రాజ్ నాథ్ చెప్పకనే చెప్పారు

29-07-2025 07:08:28 PM

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్‌లో పర్యాటకులపై ఉగ్ర దాడి చేసి బీభత్సం సృష్టించిన ఘటనకు సులేమాన్‌ సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన భారత్ సైనికులు పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులు నిర్వహించింది. దీనిపై పార్లమెంట్ లో నిర్వహించిన శీతాకాల సమావేశంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ పై ప్రతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలైపోయరని, పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని అందరూ ముక్తకంఠంత ఖండించారు. 

ఉగ్రదాడిలో పిల్లలు, వృద్ధులు, యువకులు చనిపోయారని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయని, కేంద్ర ప్రభుత్వం, సైనికులకు అన్ని పక్షాలు అండగా నిలిచాయని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారని, పహల్గాం దాడి బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించినట్లు తెలియజేశారు. భారత్-పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో లక్ష మంది పాకిస్థాన్ సైనికులను భారత్ బందీలుగా పట్టుకుందని రాహల్ గాంధీ వ్యాఖ్యానించారు. 

ఆపరేష్ సిందూర్ 22 నిమిషాల్లో పూర్తయ్యిందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారని, పాక్ సైనికుల శిబిరాలపై దాడి చేయలేదని ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఆపరేష్ సిందూర్ విషయంలో మన సైనికుల చేతులు కట్టివేశారని, అర్థరాత్రి 1.30కు పాకిస్థాన్ డీజీఎంఓతో మాట్లాడామని రాజ్ నాథ్ చెప్పినట్లు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని పాక్ తో చెప్పమని, అసలు పాకిస్థాన్ తో పోరాడే ఆలోచన లేదని రక్షణమంత్రి చెప్పకనే చెప్పారన్నారు. పాక్ సైనిక స్థావరాలపై దాడి చేయలేదని అనిల్ చౌహాన్ చెప్పారని, కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి చేశామని రాజ్ నాథ్ చెప్పినట్లు రాహల్ గాంధీ వెల్లడించారు.