28-07-2025 12:00:00 AM
సిర్గాపూర్, జులై 27 : సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) ప్రాజెక్టును ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నల్ల వాగులో ఉన్న నీటిమట్టం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వర్షాలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు దారం శంకర్ సెట్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, యాదవ్ రెడ్డి కడ్పల్, రమేష్ చౌహాన్, జిత్తు రెడ్డి, మల్దొడ్డి తుకారాం, విఠల్, రవి పాటిల్ మాజీ సర్పంచ్, జైరాజ్, శ్యామ్ ముదిరాజ్ యూత్ కాంగ్రెస్ నాయకులు, ముజామ్మిల్, వీరచారి, తదితరులుపాల్గొన్నారు.
హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్)లో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీగా మాట్లాడి, వారికి అందుతున్న ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం అవసరమైన సౌకర్యాలపై అధికారులకు, ప్రధానోపాధ్యాయునికి సూచనలు ఇచ్చారు.
అలాగే వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించాలని, తాగునీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్, రమేష్ చౌహాన్, యాదవరెడ్డి, జిత్తురెడ్డి, రవి పాటిల్, బండారి సాయిలు, జైరాజ్, వీర చారి, శ్యామ్ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సంగ్రామ్ నాయక్‌పాల్గొన్నారు.