calender_icon.png 11 January, 2026 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలభైరవ ఆలయ అభివృద్ధి చేపడతా

10-01-2026 09:17:54 PM

ప్రతి భక్తుడు అలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సహాయం అందించాలి

నూతన పాలకవర్గo సభ్యులు ఆలయ అభివృద్ధికి నిస్వార్థంతో పనిచేయాలి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలభైరవ స్వామి అభివృద్ధికి 10 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేపడుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం కాలభైరవ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఎంతో ప్రాచీన, మహి మాణిత్వం గల చరిత్ర కలిగిన కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రతిభక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

నూతన పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. పదవులు అనేవి శాశ్వతం కాదని అవకాశం వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రఖ్యా తులు తెచ్చుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, లా దృష్టికి తీసుకెళ్ళాను నిధుల మంజూరు కి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తాను ఇక్కడే పెరిగిన పరిసరాలు ఉన్నాయని తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వివరించారు. ఎంతోమంది భక్తులు కాలభైరవుని పూజిస్తారని ఎంతో మహిమలు కలిగిన కాలభైరవుని పూజిస్తే అడ్డంకులు తొలగడమే కాకుండా ఎంతో అభివృద్ధి చెందుతామన్నారు. తమ కుటుంబం కూడా కాలభైరవుడు నీ భక్తుల మేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఉందని అభివృద్ధి చేసి యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఆలయ కమిటీ చైర్మన్గా చింతల శంకర్, ఆలయ కమిటీ సభ్యులను ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు , మాజీ సింగిల్ విండో చైర్మన్లు, ఎల్లారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు గిరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, పద్మశాలి సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.