calender_icon.png 11 January, 2026 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటీసులకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

10-01-2026 09:14:22 PM

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

కోదాడ: కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు పరివాహక ప్రాంతాల్లోని 372 మందికి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు నోటీసులు జారి చేయడంతో బాధిత కుటుంబాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శనివారం పరామర్శించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోర్టు లో కేసులు వేసి మన కుటుంబాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నోటీస్ లకు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నోటీసులు అందుకున్న బాధితుల తరఫున కోర్టులో లో కౌంటర్ కేసు వేయడం జరుగుతుంది అన్నారు.పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. మళ్లీ రాబోతున్న మున్సిపల్ ఎన్నికల కోసం మనల్ని మోసం చేయడానికి వస్తున్న వ్యక్తులను నమ్మ వద్దన్నారు. మిమ్మల్ని ఎవరు ఇబ్బందులకు గురిచేసిన మాకు కోదాడ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పమంటూ వారికి భరోసా ఇచ్చారు.