calender_icon.png 4 September, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇంటి యజమానులకు ఆర్థిక సాయం

30-08-2025 06:36:38 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి (విజయక్రాంతి): అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్ల గుర్తింపు శనివారం సాయంత్రంలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండల కేంద్రంలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి తక్షిణ సాయంగా ఇంటి యజమానులకు నష్టపరిహారంగా 5000 రూపాయలను అందించాలని తాసిల్దార్ ను ఆదేశించారు. అలాగే గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వరుసగా కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు.

మండలంలో అన్ని గ్రామాలను పరిశీలించి దెబ్బ తిన్న ఇండ్ల వివరాలను సాయంత్రం లోగా అందించాలని  తాసిల్దార్ ను ఆదేశించారు. వర్షాలు కురిసిన అనంతరం వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీరు నిలువ ఉన్నచోట ఆయిల్ బాల్స్ ను వేయాలని, మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలని, మండలంలో దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారుల వివరాలను సేకరించి మరమ్మత్తు పనులు చేయాలని, విద్యుత్ సరఫరాలో సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.