30-08-2025 06:37:31 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): రైతులు కాయకష్టం చేసిసాగుచేసిన పత్తిపంటను అటవీశాఖ సెక్షన్ అదికారి ఆద్వర్యంలొ ఫారెస్టు అధికారులు చొరబడి పత్తిపంటలో మొక్కలను పీకి పడవేసిన సంఘటన కలకలం రేపుతుంది. ములుగుజిల్లాలోని తాడ్వాయి మండలం బయక్కపేట గ్రామానికి సమీపంలొ రైతులు పత్తిపంటను సాగుచేశారు. మొక్కలు మీటర్ ఎత్తునపెరిగాయి. గ్రామానికి చెందిన రైతులు పొలంపనులకు వెల్లారు. ఇదే అదునుగా చేసుకుని సెక్షన్ అధికారి, మరికొందరు సిబ్బంది. కలసి,భేష్ క్యాంప్ సిబ్బందితొ వచ్చారు.
పత్తిపంటలోకి వెల్లి, మొక్కలను పీకిపడవేసి వెల్లారని ఆరోపించారు ఈవిషయం చూసిన మరికొందరు గ్రామష్తులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పంటలోకి వెల్లిచూస్తె ఇద్దరురైతులకు చెందిన పత్తిపంటలొ మొక్కలను పీకి పడవేసి వెల్లినట్లు తెలిపారు. అడవిలోకి వెల్లిన ఫారెస్టు అధికారులు,,రోడ్డుపక్కనె ఊరిలోని వారంతా కాపలాగ ఉన్నట్లు తెలిపారు. మద్యహ్నం ఓకటిన్నరకు అడవిలొ నుంచిరోడ్డుకు చేరుకున్నారు. ఎదురుపడి నిలదీసినట్లు తెలిపారు ఇరువురి మద్యలొవాగ్వివాదం జరిగినట్లు తెలిపారు. ఇవి పోడుభూములు కాదని తాము కాయకష్టం చేసుకుని పంటవేసుకున్నామన్నారు.
ఓకొక్క మొక్కకు వేలరూపాయలు పెట్టబడి పెట్టి ఓకొక్కరైతు 2 నుంచి 3 ఎకరాలు సాగుచేశామన్నారు. పీకిన పత్తిపంటకు నష్టపరిహరం చెల్ల్చాలని బయక్కపేట గ్రామస్తులు, రైతులు, యువకులు, మహిళలు డిమాండ్ చేశారు.మళ్లెప్పుడైన మా పంటజోలికి వస్తె పురుగుల మందుతాగి ఆత్మహత్య చెసుకుంటామని హెచ్చరించారు.రైతులు,గ్రామస్తులు తిరగబడటంతొ,ఫారెస్టు అదికారులు,అక్కడి నుంచివెల్లి పోయినట్లు తెలిపారు .బాగా గొడవజరిగింది..ఇద్దరిమద్య వాగ్వివాదం జరిగడం,.ఈగొడవ ఇంతటితొ పోకుండా విషమించే విదంగా. ఉందని బావించి ఫారెస్టు అధికారులు అక్కడినుంచి వెల్లిపోయారని తెలిపారు.