స్త్రీనిధి రుణాల లక్ష్యాన్ని చేరాలి
డీఆర్డీఓ సన్యాసయ్య
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూలై 2: స్త్రీనిధి రుణాలు సంఘాలకు మంజూరి చేయడంతో పాటు టార్గెట్ ప్రకారం మొండి బకాయలను సైతం రికవరీ చేయాలని డీఆర్డీఓ సన్యాసయ్య కోరారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని మండల సమాఖ్య కార్యాలయంలో జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలకు సంబంధించిన ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య సిబ్బంది, ఆయా మండలాల్లోని వీఓఏలతో సెర్ప్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనిధి రుణాలు టార్గెట్ ప్రకారం రికవరీ చేయాలని,సమాఖ్య బిల్డింగులకు సంబంధించి గ్రామ సర్పంచులతో సమన్వయం చేసుకొని త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సురేష్, డీపీఎంలు లక్ష్మీనారాయణ, అరుణ్, శ్రీనిధి రీజనల్ మేనేజర్ శివప్రసాద్, వివిధ మండలాల ఏపీఎంలు వీఓఏలు, సమైక్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






