calender_icon.png 26 September, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయ మిత్రుడికి ఆర్థిక సహాయం

26-09-2025 06:22:18 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామానికి చెందిన పాత్రికేయుడు మొకిడి సతీష్ ఇటీవలే కాలు గాయంతో  ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విషయం తెలుసుకున్న చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలన్న ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం సతీష్ ను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలన్న మాట్లాడుతూ సతీష్ గత కొంతకాలంగా జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఇటీవలే దోమ కాటుకు గురై కాలుకు ఆపరేషన్ జరిగిందన్నారు.జర్నలిస్టుల బృందం కలిసి కొంత నగదును జమ చేసి సతీష్ కు అందజేశామని తెలిపారు.రానున్న రోజుల్లో  అండగా ఉంటామని తెలిపారు.