26-09-2025 06:26:53 PM
పెట్రోల్ బంకు ప్రారంభోత్సవంలో ఎంపీ సురేష్ షేట్కర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
పాపన్నపేట,(విజయక్రాంతి): పాపన్నపేట మండలం వ్యాపార రంగంలో ముందుండాలని, వ్యాపారంలో పోటీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో గణేష్ హెచ్పీ పెట్రోల్ బంక్ ను వారి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభించిన అనంతరం వాహనాలలో డీజిల్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాపన్నపేట ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో ముందుకు వెళుతుందన్నారు. ప్రతి ఒక్కరు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా పాపన్నపేటను వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.