26-09-2025 06:17:57 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో మరణించిన మృతుల కుటుంబాలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర సిఈవో & డిప్యూటీ సీఈవోల సంఘం అధ్యక్షుడు బచ్చు రాఘవేంద్ర రావు తండ్రి తిరుమల రావు, ఐ న్యూస్ మీడియా రిపోర్టర్ అండెం సైదులు తండ్రి వెంకటయ్య ఇటివల వివిధ కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వారి వారి ఇళ్లకు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి వెళ్లి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, నాగారం మండల అధ్యక్షుడు, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, తునికి సాయిలు, గాజుల యాదగిరి, గుండగాని దుర్గయ్య, గోపగాని రమేష్ గౌడ్, శ్రీనివాస్,కడారి దాసు, తడకమల్ల రవికుమార్, వీరోజి, గోపగాని వెంకన్న తదితరులు ఉన్నారు.