26-07-2025 12:45:10 AM
న్యూఢిల్లీ, జూలై 25: భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ద్వీపద్వేశం మాల్దీవు ల పర్యటనకు వెళ్లారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవుల పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వే డుకల కోసం ప్రధాని మా ల్దీవులకు వె ళ్లా రు. శుక్రవారం మాల్దీవుల గ డ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీకి వెలెనా అంతర్జాతీయ విమానాశ్రయంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు, ఆయన మంత్రివర్గ సహచరులు ఘనస్వాగతం పలికారు.
భారత స ంతతికి చెందిన ప్రజలు మాల్దీవుల్లో ప్రధాని మోదీకి జా తీయ జెండాలతో స్వాగతం పలికారు. ప్ర ధాని వారితో ముచ్చటించి ధ న్యవాదాలు తెలిపారు. అనంతరం ‘పొరుగుకే తొలి ప్రా ధాన్యం’ కింద మాల్దీవులకు 565 మిలియన్ అమెరికన్ డా లర్ల్ల (రూ. 4 850 కోట్ల్లు) ఆ ర్థిక సాయం కొనసాగిస్తామ ని వెల్లడించారు. మోదీ మాట్లాడుతూ.. భారత్-మాల్దీవుల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒ ప్ప ందానికి స ంబంధించి చర్చలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.
మయిజ్జు దీన్ని ధ్రు వీకరించారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్ప ం దం ఖరారుకు ఇరు దేశాలు కృషి చేయనున్నాయన్నారు. మాల్దీవులతో డిజిటల్ ట్రా న్స్‌ఫర్మేషన్ రంగాల్లో భారత్‌కు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సంతకం చేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులను భారత్, మాల్దీవులు ఎప్పటికప్పుడూ అర్థం చేసుకుంటూ ముందుకు సా గుతున్నాయని మోదీ పేర్కొన్నారు.