04-07-2025 08:09:57 PM
అనంతగిరి: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు సామాజిక తనిఖీ అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై గ్రామ సభ నిర్వహించారు. శుక్రవారం గ్రామ కార్యదర్శి జి కవిత ఆధ్వర్యంలో డి ఆర్ పి రేచల్ పాల్గొని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల ఆడిట్ పై తనిఖీ నిర్వహించారు. తనిఖీలు గుర్తించిన అంశాలను చదివి వినిపించారు ఇట్టి విషయంపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది.