11-09-2025 05:09:21 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మండలంలోని చందుపట్ల గ్రామంలోని పురాతన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి చందుపట్ల గ్రామానికి (ప్రస్తుతం హైదరాబాద్) చెందిన కందిమల్ల లక్ష్మారెడ్డి రూ. 6 లక్షల విరాళం అందజేశారు. చందుపట్ల గ్రామంలోని అరుదైన స్తంభ నరసింహస్వామి చాలాకాలంగా ఆలయ ప్రహరీ కూలి శిధిలావస్థలో ఉన్న విషయాన్ని దాత లక్ష్మారెడ్డికి వివరించగా స్పందించి పూర్తి చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. గురువారం గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ మంగినపల్లి వెంకటయ్య , చౌగోని రామాంజనేయులు, యానాల శ్రీనివాసరెడ్డి, కంచరకుంట్ల సంజీవరెడ్డి, మాజీ ఎంపిటిసి ఇమ్మడపాక లక్ష్మీ వెంకన్న, నర్సింగ్ వెంకటేష్, సీతారామచంద్రస్వామి దేవాలయం చైర్మన్ మేడవరపు కిషన్ రావు, జోర్రీగల వెంకటేశ్వర్లు, మల్గి రెడ్డి రంగారెడ్డి ,జిల్లా డాకయ్య పాల్గొన్నారు.