calender_icon.png 20 January, 2026 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదర్షాకోట్‌లో హోటల్‌కు జరిమానా

19-09-2024 12:34:51 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్18: ప్రభుత్వ నిబంధనలు పాటించని ఓ హోటల్‌కు అధికారులు జరిమానా విధించారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ శాంతినగర్‌లో ఉన్న శ్రీరమణ మహర్షి ఫుడ్ కోర్టులో బుధవారం కమిషనర్ శరత్‌చంద్ర ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. హోటల్ యాజమాన్యం ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కమిషనర్.. యాజమాన్యానికి రూ.10వేల జరిమానా విధించారు. మరోసారి నిబంధనలు పాటించకపోతే హోటల్‌ను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ శ్రావణ్, శానిటరీ జవాన్లు మల్లేశ్, సురేందర్, రాము, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.